మాఫియా వెన్నులో వణుకు పుట్టిస్తున్న యూపీ సీఎం యోగి

Yogi Adityanath
Yogi Adityanath

లక్నోః ఉత్తరప్రదేశ్ అంటే మాఫియా కు , అత్యాచారాలకు , క్రైమ్ కు ఇలా అన్నింటికీ బాగా ఫేమస్. వేలసంఖ్యలో ఇక్కడ నేరగాళ్లు ..నేరాలు చేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంటారు. అలాంటిది ఇప్పుడు సీఎం యోగి పేరు చెపితే.. మాఫియా వణికిపోతున్నారు. మాఫియాపై ఉక్కుపాదం మోపుతూ డాన్‌లు, గూండాలు, రౌడీలు, నేరస్థులను ఉపేక్షించేది లేదని యోగీ పలు మార్లు ప్రకటించారు.

యోగీ ప్రభుత్వ పాలనలో ఇప్పటి వరకు11 వేల ఎన్‌కౌంటర్లు జరిగాయని, ఇందులో పేరు మోసిన నేర చరిత్ర కలిగిన 183 మంది మరణించారని తెలుస్తున్నది. రాష్ట్ర పోలీసులపై కాల్పులు జరపడం, అరెస్టయిన వారు తప్పించుకునే ప్రయత్నం చేయడం లాంటి ఘటనల్లో తప్పనిసరి పరిస్థితుల్లో ఆత్మరక్షణ కోసం ఎన్‌కౌంటర్‌ చేయడం అనివార్యమైందని యూపీ పోలీసు ఉన్నతాధికారులు వివరిస్తున్నారు. గత ఐదేళ్లలో ఈ ప్రాంతంలో అత్యధికంగా 3,205 ఎన్‌కౌంటర్లలో 64 మంది మరణించినట్లు తెలుస్తున్నది. ఇప్పటి వరకు 23,300 మంది నేరస్థులను యోగీ ప్రభుత్వం అరెస్టు చేసింది. ఈ మొత్తం ఎన్‌కౌంటర్లలో 1,443 మంది పోలీసులు గాయపడగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా నేరగాళ్ల ఫై ఉక్కుపాదం మోపిన యోగి అంటూ కొందరు ప్రశంసలు కురిపిస్తుంటే..మరికొంతమంది మాత్రం విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం చట్టాలను చేతుల్లోకి తీసుకుంటున్నదని కొంతమంది అంటున్నారు. ఏది ఏమైనప్పటికి యోగి సర్కార్ మాత్రం నేరగాళ్లలో వణుకు పుట్టిస్తుందనేది మాత్రం నిజం.