నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

కేంద్ర ఎన్నికల సంఘం మూడు ఈశాన్య రాష్ట్రాల తాలూకా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ని ప్రకటించింది. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ని ఈసీ ప్రకటించింది. త్రిపురలో ఫిబ్రవరి 16న పోలింగ్ జరగనుండగా.. నాగాలాండ్, మేఘాలయాలో ఫిబ్రవరి 27న ఎన్నిక నిర్వహించనున్నారు. ఈసీ షెడ్యూల్ ప్రకటించడంతో మూడు రాష్ట్రాల్లో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది.

ఈ మూడు రాష్ట్రాల ప్రస్తుత శాసనసభల పదవీకాలం మార్చితో ముగియనుంది. ఇటీవల కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ నేతృత్వంలోని ఏసీ బృందం ఈ మూడు రాష్ట్రాలలో పర్యటించి ఎన్నికలపై రాజకీయ పార్టీలు, స్థానిక యంత్రాంగం, పోలీసు సిబ్బంది అభిప్రాయాలు తీసుకుంది.

మేఘాలయ లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 60
నోటిఫికేషన్ జనవరి 31
పోలింగ్ ఫిబ్రవరి 27
కౌంటింగ్ మార్చ్ 02

త్రిపుర మొత్తం అసెంబ్లీ స్థానాలు 60
నోటిఫికేషన్ జనవరి 21
పోలింగ్ ఫిబ్రవరి 16
కౌంటింగ్ మార్చ్ 02

నాగాలాండ్ మొత్తం అసెంబ్లీ స్థానాలు 60
నోటిఫికేషన్ జనవరి 31
పోలింగ్ ఫిబ్రవరి 27
కౌంటింగ్ మార్చ్ 02

మార్చ్ నెలఖరులోగా ఈ మూడు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.