అయోధ్య రామ మందిరం ప్రత్యేకతలు తెలుసా..?

అంతా రామమయమే.. అయోధ్య లో ఎటు చూసినా రామనామ సంకీర్తనలు.. ఆధ్యాత్మిక కోలాహలమే. రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ వేడుకను చూసేందుకు దేశ వ్యాప్తంగా భక్తులు , పలు రంగాల ప్రముఖులు , రాజకీయ నేతలు ఇలా అనేక రంగాల VIP లు చేరుకున్నారు. మరికాసేపట్లో మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగబోతుంది.

ఈ నేపథ్యంలో అయోధ్య రామ మందిరం ప్రత్యేకతలు ఒక్కసారి తెలుసుకుందాం.

రాంలాలా కోసం గొప్ప శ్రీ రామ జన్మభూమి ఆలయం సాంప్రదాయ నగర శైలిలో నిర్మించబడింది. దీని పొడవు (తూర్పు-పడమర) 380 అడుగులు; వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు, దీనికి మద్దతుగా మొత్తం 392 స్తంభాలు, 44 తలుపులు ఉన్నాయి. ఆలయ స్తంభాలు, గోడలపై హిందూ దేవుళ్ళ, దేవతల చిత్రాలు చెక్కబడ్డాయి. శ్రీ రాముని చిన్ననాటి రూపం (శ్రీరాంలాలా విగ్రహం) గ్రౌండ్ ఫ్లోర్‌లోని ప్రధాన గర్భగుడిలో ఉంచబడింది.

అలాగే రామ మందిరం ప్రధాన ద్వారం తూర్పు దిశలో ఉండగా.. సింగ్ గేట్ నుండి 32 మెట్లు ఎక్కి ఇక్కడికి చేరుకోవచ్చు. ఆలయంలో మొత్తం ఐదు మండపాలు (హాల్స్) ఉన్నాయి. నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థన మండపంచ, కీర్తన మండపం. రామ మందిరానికి సమీపంలో ఒక బావి (సీతా కూప) ఉంది, ఇది చారిత్రాత్మకమైనది. పురాతన కాలం నాటిది. ఆలయ సముదాయం నైరుతి భాగంలోని కుబేర్ తిల వద్ద, జటాయువు విగ్రహంతో పాటు పురాతన శివుని ఆలయం పునరుద్ధరించబడింది.

ఇక ఆలయం నిర్మాణంలో ఎక్కడ సిమెంట్ కానీ ఇనుము కానీ ఉపయోగించలేదు. ఆలయ పునాది 14 మీటర్ల మందంతో రోలర్-కాంపాక్ట్ కాంక్రీటు (RCC)తో నిర్మించబడింది. ఇది కృత్రిమ శిలలా తయారవుతుంది. ఈ ఆలయాన్ని దేశ సంప్రదాయ, స్వదేశీ సాంకేతికతతో పాటు నగర శైలిలో నిర్మించారు. ఆలయ నిర్మాణంలో ఇప్పటి వరకు రూ.1100 కోట్లు ఖర్చు కాగా.. మరో రూ.300 కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. మరోపక్క ఆలయ నిర్మాణానికి ఎంతో మంది విరాళాలు అందజేశారు. ఇంకా అందజేస్తూనే ఉన్నారు.