తెలంగాణ లో నేడు , రేపు అతి భారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు , రేపు అతి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మొన్నటి వరకు నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కావడం తో రైతులంతా ఆందోళన లో పడ్డారు. జూన్ నెల పూర్తి అవుతున్న ఇంకా వర్షాలు పడకపోయేసరికి ఈసారి కాలం అవుతుందా లేదా అనే భయంలో ఉన్నారు. కానీ రెండు రోజులుగా రాష్ట్రంలోని పలు జిలాల్లో వర్షాలు మొదలుకావడం తో రైతుల్లో కాస్త ఊపిరి వచ్చినట్లు అయ్యింది.

ఇక రాష్ట్రంలో ఉత్తర తెలంగాణలోని 8 జిల్లాలకు వాతావరణశాఖ అతి భారీ వర్షసూచన జారీ చేసింది. శని, ఆదివారాల్లో భారీ వర్షాలు పడనున్నాయని తెలిపింది. రెండు రోజుల క్రితం ఖమ్మంలోకి ప్రవేశించిన రుతుపవనాలు నిజామాబాద్ వరకు విస్తరించినట్లు పేర్కొంది. నేటితో తెలంగాణ అంతటా విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. నైరుతి రుతుపవనాల రాకతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం, భద్రాది కొత్తగూడెంపాటు యాదాద్రి-భువనగిరి, ములుగు జిల్లాల్లో 3 రోజులపాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనంతో మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.