నేడు మలికిపురంలో జనసేన బహిరంగ సభ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర ఉభయ గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. శుక్రవారం.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంబాజీపేట, పి.గన్నవరం, రాజోలు, జగ్గన్నపేట మీదుగా యాత్ర కొనసాగించారు. ఈరోజు మలికిపురం లో భారీ బహిరంగ సభ ను నిర్వహించనున్నారు.

అమలాపురంలో పవన్ మాట్లాడుతూ..నాయకుడు అనేవాడు కులాల మద్య విద్వేషాలు రెచ్చగొట్టేవాడు కాదని..మనుషులను కలిపేవాడే నాయకుడన్నారు. కోనసీమ వాసుల్లో ఉన్న పౌరుషం, కోపాన్ని దోపిడి చేసే వారిమీద ఉపయోగిస్తే ప్రయోజనం ఉంటుందని చెప్పారు. ప్రజల కోసం ఎవరితోనైనా గొడవ పెట్టకోవడానికి తాను సిద్దమని..ముఠా మేస్త్రీలా మీ కోసం పనిచేస్తానని అన్నారు. రాష్ట్రంలో మార్పు రావాలని, ఆ మార్పు కోనసీమ నుండే మొదలవ్వాలని ఆకాంక్షించారు. అమలాపురాన్ని ఏ-1గా చేద్దాం. అమలాపురం, కోనసీమలో పవన్ పర్యవేక్షణ ఉండాలి. కుల ఘర్షణలు నివారించాలంటే సమాజాన్ని అర్థం చేసుకున్న వ్యక్తులు ఉండాలి. జనసైనికులు వివాదాలు, విమర్శల జోలికి వెళ్లకూడదని సూచించారు.

ఇక రాజోలు లో పవన్‌ ర్యాలీలో విద్యుత్‌ నిలిచిపోవడంతో.. అంధకారంలోనూ సెల్‌ఫోన్‌లతో పవన్‌కు స్వాగతం పలికారు అభిమానులు. ఓవరాల్ గా పవన్ యాత్ర విజయవంతంగా కొనసాగుతుండడం, ప్రజలు , జనసేన శ్రేణులు , అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడం పార్టీ లో కొత్త జోష్ ను నింపుతుంది.