‘మా’ ఎన్నికలు : రోజా ఓటు ఎవరికంటే..

మా ఎన్నికలకు మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో ప్యానల్ సభ్యులలో టెన్షన్ ఎక్కువ అవుతుంది. ఎవరు ఎవరికీ ఓటు వేస్తారో అని టెన్షన్ పడుతున్నారు. మరోపక్క సీనియర్ నటులు , మరికొంతమంది నటి నటులు తమ మద్దతు ఎవరికో మీడియా ముందు చెప్పేస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణం రాజు, బాలకృష్ణ పలువురు మంచు విష్ణు ప్యానల్ కు సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక మెగా ఫ్యామిలీ మాత్రం ముందు నుండి కూడా ప్రకాష్ రాజ్ కు మద్దతు ప్రకటిస్తూ వచ్చారు.

ఈ క్రమంలో సినీ నటి , వైసీపీ ఎమ్మెల్యే రోజా తన మా ఓటు ను ఎవరికీ వేస్తుందో తెలిపింది. “ఖచ్చితంగా ఒక ‘మా’ ఆర్టిస్ట్ గా ‘మా’ ఎన్నికల్లో పాల్గొంటాను. కానీ ఈరోజు ‘మా’ అసోసియేషన్ ను అభివృద్ధి చేయడానికి ఎవరు ఏం చేస్తారు ? అనే విషయాన్ని తెలియజేస్తూ మేనిఫెస్టో విడుదల చేశారు. దాంట్లో ‘మా’ ఆర్టిస్టులకి ఏ మేనిఫెస్టో ఉపయోగకరంగా ఉంటుందో వారికే ఓటు వేస్తాను” అని అన్నారు. అయితే “మా”లో లోకల్, నాన్ లోకల్ అనే వివాదం నడుస్తోంది. మీరు దేనికి సపోర్ట్ చేస్తారు ? అని అడగ్గా… “కాంట్రవర్సీ ప్రశ్నలు నన్ను అడగొద్దు. ఈసారి ‘మా’ ఎన్నికలు మా రాజకీయ ఎన్నికలకన్నా వాడిగా వేడిగా సాగుతున్నాయి. అందులో నేను వేలు పెట్టదలచుకోలేదు. కానీ ఒక ఆర్టిస్ట్ గా నా ఓటును మాత్రం ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటాను. ‘మా’ను ఎవరైతే అభివృద్ధి చేస్తారని నమ్ముతానో ఆ ప్యానల్ కే ఓటు వేస్తాను” అని తెలిపింది.