ఏప్రిల్ 14 వరకు అక్కడే ఉండండి
వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి ట్వీట్

అమరావతి: ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే, ఇతర రాష్ట్రాలో ఉన్న ఏపి ప్రజలను తమ సొంత రాష్ట్రంలోకి రానివ్వకపోవడంతొ, వైసిపి ప్రభుత్వంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి స్పందిస్తూ ట్వీట్ చేశారు. పొరుగు రాష్ట్రాలో ఉన్న ఏపి ప్రజలు ఏప్రిల్ 14 వరకు అక్కడే ఉండాలి. దీని సంబందించి సిఎం కెసిఆర్ గారితో జగన్ గారు మాట్లాడారు. అక్కడా వారికి ఏ కొరత రాకుండా చూసుకుంటామని హమి ఇచ్చి కెసిఆర్ గాకు పెద్ద మనసును చాటుకున్నారు. బయటి నుంచి పౌరులు వస్తే నియంత్రణ చర్యలు గతి తప్పె ప్రమాదం ఉంది అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/