ఏపిలో పలుచోట్ల భారీ వర్షం

వాతావరణ శాఖ హెచ్చరిక

rain fall
rain fall

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. కృష్ణా జిల్లాలోని నాగాయలంకలో ఈదురు గాలుల కారణంగా సెల్‌ టవర్‌ నేలకొరిగింది. అలాగే తూ.గొ జిల్లాలో సైతం ఉరుములు మెరుపులతో కూడిన వర్షంపడుతుంది. పలు ప్రాంతాల్లో గాలి వాన కారంగా వరిచేలు నీటమునిగాయి. కృష్ణా జిల్లాతో పాటు ఉత్తర కోస్తా ప్రాంతంలో కూడా భారీ వర్షాలతో పాటు పిడుగులుపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా ఇప్పటికే కరోనా కారణంగా రైతులు పంటల కొనుగోలు లేక ఇబ్బందులు పడుతుంటే ఈ సమయంలో కురిసే అకాల వర్షాల కారణంగా నష్టాలను చూడాల్సి వస్తుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక చేయండి: https://www.vaartha.com/news/international-news/