ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి టీడీపీ లేఖ

చంద్రబాబు ప్రాణాలకు ముప్పు..టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య

TDP letter to AP DGP Rajendranath Reddy

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రాణాలకు ముప్పు ఉందని ఏపీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. ఈ మేరకు టీడీపీ కేంద్ర కార్యాలయానికి సాయుధ బలగాలతో భద్రత కల్పించాలంటూ ఆయన లేఖలో కోరారు. చంద్రబాబుకు సంఘ విద్రోహ శక్తుల నుంచి ముప్పు ఉందని తెలిపారు. ఏపీతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి టీడీపీ కార్యాలయాన్ని సందర్శించే నాయకులకు సైతం తీవ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తుల నుంచి తీవ్రమైన ముప్పు ఉందని చెప్పారు.

ఇప్పటికే కొందరు దుండగులు పార్టీ కార్యాలయంపై దాడి చేసిన సంగతిని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో వెంటనే స్పందించి పార్టీ కార్యాలయానికి నిత్యం సాయుధ బలగాలతో రక్షణ కల్పించాలని లేఖలో డీజీపీని డిమాండ్‌ చేశారు వర్ల రామయ్య. ముఖ్యంగా వైసీపీ నేతల నుంచి తమకు ప్రమాదం ఉందని లేఖలో

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/international-news/