కాటన్‌ మాస్క్‌లు శుభ్రంగా..

ఆరోగ్య సంరక్షణ చర్యలు

కాటన్‌ మాస్క్‌లు శుభ్రంగా..
Cotton Mask

మాస్కులు వేసుకోవడం ఎంత అవసరమో వాటిని శుభ్రంగా ఉంచుకోవడమూ అంతే ముఖ్యమని అంటున్నారు నిపుణులు. చాలా మంది అందుబాటులో ఉన్న కాటన్‌ మాస్కులను ధరిస్తున్నారు.

ఇవి వైరస్‌ని పూర్తిగా నియంత్రించకున్నా కొంత వరకు రక్షణగా ఉంటాయని టెక్సాస్‌ యూనివర్సిటీకి చెందిన ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

కాటన్‌ మాస్క్‌లు శుభ్రంగా..

ఈ మాస్కులని రోజుకోసారి ఉతుక్కోవాలని సూచిస్తున్నారు. సాధారణంగా సబ్బులకంటే బ్లీచ్‌
ఉన్న వాటితోనే మాస్కులను ఉతకాలి.

అవి హానికర సూక్ష్మజీవులను సమర్ధంగా నాశనం చేస్తాయి. సాధ్యమైనంత వరకు మాస్కును వేడినీటితోనే ఉతకాలి. వాషింగ్‌ మెషీన్‌లో వేసినా మంచిదే.

చేత్తో ఉతికితే సబ్బు బాగా పెట్టి వేడినీటిలో అరనిమిషం పాటు జాడించాలి. ఉతికిన తరువాత ఎండ బాగా తగిలే చోట ఆరేయాలి. ఉతికిన మాస్కులను ఇస్త్రీ చేసే మంచిది.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/