పొంచివున్న ‘స్టెల్త్ ఒమిక్రాన్’ ముప్పు !

వైద్య నిపుణుల హెచ్చరిక

Concern over stealth omicron
Concern over stealth omicron

కరోనా 4వ దశ ముప్పు రానుందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విజయవాడ శాఖ దేశ ప్రజలనుద్దేశించి ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఒమిక్రాన్ కంటే స్టెల్త్ ఒమిక్రాన్ జోరుగా వ్యాపిస్తుందని, ప్రపంచవ్యాప్తంగా తన ఉనికిని చాటుతోందని పేర్కొంది.

ఇపుడు కరోనా కేసులు తగ్గాయని కరోనా వైరస్‌ను తక్కువ అంచనా వేయొద్దని, అజాగ్రత్తగా ఉండొద్దని ప్రజానీకాన్ని కోరింది. మాస్కులు ధరిస్తూనే ఉండాలని, శానిటైజర్లు వాడాలని సూచించింది. ఇదిలా ఉండగా, చైనాలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి చెందడం ఆందోళన కలిగిస్తోందని, ‘స్టెల్త్‌ ఒమిక్రాన్‌’ రూపంలో ఈ మహమ్మారి ఇపుడు కొత్తగా వ్యాప్తి చెందుతోందని పేర్కొంది.

తెర (సినిమా) వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/