ఉరి శిక్షపై సౌదీ ప్రభుత్వం కీలక నిర్ణయం

మైనర్లు నేరానికి పాల్పడితే విధించే మరణ శిక్షను రద్దు

saudi-arabia flag
saudi-arabia flag

సౌదీ: సౌదీ అరేబియాలో తప్పులు చేస్తే కఠినమైన శిక్షలు విధిస్తారన్న విషయం తెలిసిందే. అందులో ముఖమైనవి బహిరంగ ఉరి శిక్ష, కొరడా దెబ్బలు. ఉంటాయి. అయితే తాజాగా సౌదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ఉరి శిక్ష, కొరడా దెబ్బలు. చిన్న పిల్లలు తప్పుచేస్తే విధించే మరణ శిక్షను రద్దు చేసింది. మైనర్లు నేరానికి పాల్పడితే వాళ్లకు ఇక నుంచి మరణ శిక్ష ఉండదు. దీనిపై మానవ హక్కుల కమిషన్ ప్రెసిడెంట్ అవాద్ అల్వాద్ ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో ‘ విజన్ 2030లో భాగంగా దేశంలోని అన్ని రంగాలలో కీలక సంస్కరణలను రూపొందించేందుకు దేశ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ప్రిన్స్ ముహ్మద్ బిన్ సల్మాన్ స్వయంగా వీటన్నింటిని పర్యవేక్షిస్తున్నారు. కొత్త శిక్షాస్మృతిని స్థాపించడంలో తాజా నిర్ణయం దోహదం చేస్తుంది. త్వరలోనే మరిన్ని సంస్కరణలు అమల్లోకి వస్తాయి’ అని వెల్లడించారు. కాగా, ఉరి శిక్షను రద్దు చేసే ఆలోచన చేయాలని గత ఏడాది సౌదీ అరేబియాను ఐక్యరాజ్యసమితి కోరింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/