వైస్ షర్మిల ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు

ys-sharmila-house-arrested-forces-deployed-in-front-of-her-house

హైదరాబాద్ లోటస్ పాండ్ లోని YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇంటి వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. TSPSC పేపర్ లీకేజీలో ఈరోజు ఇందిరాపార్క్ వద్దకు ధర్నాకు పిలుపునిచ్చారు షర్మిల. అయితే ట్రాఫిక్ సమస్యలు వస్తాయనే కారణంతో అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయినప్పటికీ ఇందిరాపార్క్ కు వెళ్తామని పార్టీ నేతలు చెప్పడంతో పోలీసులు షర్మిల ఇంటివద్ద భారీగా మోహరించారు. దర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై షర్మిల కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. TSPSC పేపర్ లీకేజీలో పేపర్ లీకేజీలో నిందితులపై చర్యలు తీసుకోవాలని షర్మిల డిమాండ్ చేస్తున్నారు.

ప్రతిపక్ష, విపక్ష పార్టీలపై కుట్రతోనే ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని ఆరోపించారు. ట్రాఫిక్ జామ్ కారణాలు చూపించి అనుమతి ఇవ్వకపోవడం సరికాదని చెప్పారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరిగి రెండు రోజులు కాకముందే రాజ్యంగాన్ని తుంగలో తొక్కారని, ప్రజాస్వామ్యాన్ని గాలికొదిలేశారని షర్మిల విమర్శించారు.

ప్రతిపక్ష, విపక్ష పార్టీలతో పాటు ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు కలిసి యువత కోసం టి సేవ్ పేరుతో ఉద్యమం చేస్తున్నట్లు షర్మిల చెప్పారు. కానీ తమ ఉద్యమాన్ని ఆడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, తమ కార్యక్రమాలకు అనుమతి ఇవ్వడం లేదన్నారు. కేసీఆర్ ఎన్ని కుట్రల చేసినా నిరుద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తామని, కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజల్లో ఎండగడుతామని షర్మిల అన్నారు.