మల్కాజ్‌గిరి ఎంపీ స్థానంపై కిరణ్ కుమార్ రెడ్డి కన్ను..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రీసెంట్ గా బిజెపిలో చేరిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని బిజెపి కేంద్ర కార్యాలయంలో ఆయన బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. కాగా ప్రస్తుతం కిరణ్ కుమార్ అసెంబ్లీ స్థానం ఫై కాకుండా మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానం ఫై కన్నేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి బిజెపి కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తుంది.

హైదరాబాద్‌తో కిరణ్ కుమార్ రెడ్డికి ప్రత్యేక అనుబంధం ఉంది. చిన్నప్పటి నుంచి ఆయన విద్యాభ్యాసం అంతా నగరంలోనే జరిగింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌తో పాటు నిజాం కాలేజీలో ఆయన చదువుకున్నారు. అంతేకాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఎంగా పనిచేయడం, హైదరాబాద్ అభివృద్ధిని కొనసాగించడంతో ఆయనకు మంచి పేరే ఉంది. దీంతో పాటు మల్కాజ్‌గిరి పరిధిలో ఆంధ్రా సెటిలర్ల ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అందుకే కిరణ్ ఈ స్థానం ఫై కన్నేసినట్లు తెలుస్తుంది. ఇక హైదరాబాద్‌లో బలపడాలని చూస్తున్న బీజేపీ.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దింపాలని చూస్తోంది. ప్రస్తుతం మల్కాజ్‌గిరి ఎంపీగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఉన్నారు. దీనిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.