దసరా టీం ఫై అల్లు అర్జున్ ప్రశంసల జల్లు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..దసరా టీం ఫై ప్రశంసలు జల్లు కురిపించారు. నాని – కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో మార్చి 30 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ దసరా. పాన్ ఇండియా గా పలు భాషల్లో విడుదలైన ఈ మూవీ మొదటి రోజు మొదటి ఆట తోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. వారం రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్ లో చేరి నాని కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా ఈ మూవీ లో నాని యాక్టింగ్ కు ఫిదా అయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఊర మాస్ గెటప్ లో కనిపించి అదరగొట్టాడు. ఇక ఈ మూవీ చూసి ఎంతోమంది సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించగా..తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ..చిత్ర యూనిట్ ఫై ప్రశంసలు కురిపించారు.

‘‘దసరా టీమ్ మొత్తానికి పెద్ద అభినందనలు. నా సోదరుడు నాని పనితీరు ఎంతో బాగుంది. కీర్తి సురేష్ స్వచ్ఛమైన నటన చూపించింది. పాటలు అద్భుతంగా ఉన్నాయి. సంగీత దర్శకుడు సంతోష్ గారు మంచి స్కోరు సంపాదించారు. సత్య గారు అద్భుతమైన కెమెరా పనితీరు చూపించారు. అరంగేట్రంతోనే ఈ సినిమా డైరెక్టర్ ఓదెల శ్రీకాంత్ కారు అదరగొట్టేశారు. నిర్మాతలతోపాటు, సినిమాకు చెందిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు. వేసవిలో వచ్చిన అచ్చమైన దసరా’’ అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.