కృష్ణమ్మ పరవళ్లు
శ్రీశైలానికి పెద్ద ఎత్తున వరద నీరు

SriSailam: ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. నదిలో భారీ వరద పారుతోంది.
ఆల్మట్టి మినహా మిగతా జలాశయాలన్నీ ఇప్పటికే నిండిపోగా, శ్రీశైలానికి పెద్ద ఎత్తున వరద నీరు పోటెత్తుతోంది.
శ్రీశైలం ప్రాజెక్టు మొత్తం సామర్ధ్యం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 870 అడుగులకు నీరు చేరింది.
రిజర్వాయర్ లో 141 టీఎంసీలకు పైగా నీరు నిల్వ ఉందని, 1.22 లక్షలకు పైగా ఇన్ ఫ్లో వస్తుండగా, జల విద్యుత్ కేంద్రాల ద్వారా 43,048 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నామని అధికారులు తెలిపారు.
తాజా ‘మొగ్గ’ (చిన్నారుల ప్రత్యేకం) కోసం : https://www.vaartha.com/specials/kids/