కృష్ణా బ్యారేజీ వద్ద భారీగా వరద నీరు

50వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల

Heavy flood water at Krishna Barrage
Heavy flood water at prakasam Barrage

Amaravati: కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రకాశం బ్యాకేజ్‌ వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది.

వరదకు వర్షం తోడు కావటంతో నీటి ప్రవాహం భారీగా పెరుగుతోంది. దీంతో  50వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు.

మరో 80వేల క్యూసెక్కుల ఇన్‌ప్లో రావచ్చని అంచానా వేస్తున్నారు.

గంటగంటకు వరద పెరుగుతుండటంతో ప్రకాశం బ్యారేజ్‌ వద్ద పరిస్ధితిని జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ పరిశీలిస్తూ ఇరిగేషన్‌ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తాజా ‘చెలి’ శీర్షికల కోసం : https://www.vaartha.com/specials/women/