క్రాస్ ఓటింగ్ ఆరోపణల ఫై మేకపాటి చంద్రశేఖరరెడ్డి క్లారిటీ

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలిచిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని, నలుగురు వైస్సార్సీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి క్రాస్ ఓట్ వేశారని వైస్సార్సీపీ ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే తనపై వస్తున్న ఆరోపణల ఫై ఉండవల్లి శ్రీదేవి క్లారిటీ ఇవ్వగా..తాజాగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు.

నేను పార్టీ చెప్పిన ప్రకారం వెంకట రమణ కే ఓటు వేశానని.. ఆయన గెలిచారు. నన్ను ఎవరూ అనటానికి లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. నేను ఓటు వేసిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ ని కలిసి వచ్చానని అన్నారు. ఎమ్మెల్యే పదవినే తృణప్రాయంగా వదిలి వచ్చిన వాడిని అని పేర్కొన్నారు. టికెట్ ఇస్తే పోటీ చేస్తా…లేదంటే లేదని తేల్చి చెప్పారు. నియోజకవర్గంలో నేను ఏంటో చూపిస్తానని… జగన్ కూడా టికెట్ విషయంలో నాకు సానుకూలంగా లేరని పేర్కొన్నారు. ఎవరో నా మీద తప్పుడు సమాచారం ముఖ్యమంత్రి కి మా పార్టీ నేతలే ఇచ్చారని మండిపడ్డారు.