ప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద నీరు

ప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద నీరు
Prakasam barrage

విజయవాడ: ప్రకాశం బ్యారేజీకి ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరుతుండడంతో అధికారులు ఎప్పటికప్పుడు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 15 గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిన్న దాదాపు 27వేల క్యూసెక్కుల నీరు ఎగువ నుంచి రావడంతో 21,750 క్యూసెక్కుల నీరును దిగువకు విడుదల చేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/