ఎంపీ అర్వింద్‌ ఇంటిపై దాడిని ఖండించిన గవర్నర్

నిజామాబాద్ బిజెపి ఎంపీ అర్వింద్‌ ఇంటిపై టిఆర్ఎస్ కార్యకర్తల దాడిని గవర్నర్ తమిళసై ఖండించారు. హైదరాబాద్‌లోని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడి చేయటం.. వాళ్ల ఇంట్లో సభ్యులను భయబ్రాంతులకు గురి చేయటం.. ఇంట్లో వస్తువులను ధ్వసం చేయటాన్ని గవర్నర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు చోటులేదని స్పష్టం చేశారు. ఈ దాడిని సీరియస్‌గా తీసుకున్న గవర్నర్ తమిళిసై.. ఈ ఘటనపై రిపోర్టు ఇవ్వాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు. తమిళిసై కార్యాలయ ట్విట్టర్‌ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.

టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితఫై అరవింద్ అనుచిత వ్యాఖ్యలు చేసారని , శుక్రవారం ఉదయం బంజారాహిల్స్ లోని అరవింద్ ఇంట్లోకి చొరబడ్డ టిఆర్ఎస్ కార్య కర్తలు ఇంట్లోని ఫర్నిచర్ ధ్వసం చేసి , నానా బీబత్సం చేసారు. ఆ సమయంలో అరవింద్ ఇంట్లో లేరు. ఆయన తల్లి తో పాటు పలువురు మహిళలు ఉన్నారు. కాగా ఈ ఘటన ఫై బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క టీఆర్ఎస్ కార్యకర్తల దాడిపై బంజారాహిల్స్ పోలీసులకు ఎంపీ అర్వింద్ తల్లి విజయలక్ష్మీ ఫిర్యాదు చేశారు. 50 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు తమ ఇంటిపై దాడి చేశారని తెలిపారు. సెక్యూరిటీ గార్డ్, ఇంటి పనిమనిషిపై దాడి చేసినట్లు వివరించారు. కారు, ఇంట్లో ఫర్నిచర్, పూలకుండీలు, దేవుడి ఫొటోలు ధ్వంసం చేసినట్లు పిర్యాదు లో పేర్కొన్నారు.