బాపు మ్యూజియంను ప్రారంభించిన సిఎం జగన్‌

Inauguration of Revamped Bapu Museum by Hon’ble CM of AP at Vijayawada

విజయవాడ: సిఎం జగన్‌ రూ.8 కోట్లతో అభివృద్ధి చేసిన బాపు మ్యూజియాన్ని గురువారం ప్రారంభించారు. మ్యూజియం వద్ద పింగళి వెంకయ్య విగ్రహాన్ని సిఎం జగన్‌ ఆవిష్కరించారు. అనంతరం విక్డోరియా మహల్‌లోని బాపూజీ చిత్రపటానికి నివాళులర్పించారు. 10 లక్షల ఏళ్ల చరిత్రకు సాక్షిగా నిలిచే అరుదైన 1,500 వస్తువులను బాపు మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. ఆది మానవుడి నుంచి 19వ శతాబ్ధపు ఆధునిక మాన వుడు వరకు ఉపయోగించిన వస్తువులు, కళాఖండాలు, వస్త్రాలు, వంట సామగ్రి తదితరాలను భద్రపరిచారు. జాతీయ నాయకుల విగ్రహాలను పరిశీలించారు. ఆది మానవ చరిత్రకు సాక్షిగా నిలిచే పురాతన వస్తువులు, శిల్పకళ సంపదతో పాటు ఆధునిక హంగులతో మ్యూజియాన్ని తీర్చిదిద్దారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/