ఫిరోజాబాద్‌లో హృదయవిదాకర సంఘటన

ప్రతి రోజు గుండెపోటు మరణాలు ఎక్కువై పోతున్నాయి. గతంలో 60 , 70 ఫై బడిన వారు ఎక్కువగా గుండెపోటుకు గురై వారు..కానీ కరోనా తర్వాత వయసు తో సంబంధం లేకుండా గుండెపోటులు వస్తున్నాయి. రెండేళ్ల పిల్లల దగ్గరి నుండి ముసలి వారి వరకు అందరికి గుండెపోటు వస్తుంది.

తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో హన్స్ వాహిని స్కూల్లో చదువుతున్న రెండో తరగతి విద్యార్థి చంద్రకాత్ గుండెపోటులో మృతి చెందారు. స్కూలు ప్రాంగణంలో ఆడుకుంటూ చంద్రకాంత్ కుప్పకూలిపోయాడు. విద్యార్థిని వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేదు. గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. అయితే క్షణాల్లోనే బాలుడు ప్రాణం పోయిన దృశ్యాలు సీసీ పుటేజ్‌లో రికార్డు అయ్యాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.