మహేష్ కోసం రష్మిక ఐటెం గా మారబోతుందా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం క్రేజీ బ్యూటీ రష్మిక ఐటెం గా మారబోతుందా..? ప్రస్తుతం ఫిలిం సర్కిల్లో ఇదే చర్చ నడుస్తుంది. గీత గోవిందం మూవీ తో యూత్ ను ఫామిలీ ఆడియన్స్ ను కట్టిపడేసింది రష్మిక..ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ గా మారింది. రీసెంట్ గా పుష్ప మూవీ తో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు సాధించి , తెలుగు, హిందీ , తమిళ్ సినిమాలు చేస్తుంది. ఈ క్రమంలో ఈ భామ కు మహేష్ మూవీ లో ఐటెం సాంగ్ చేసే ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ మూవీ..వచ్చే నెల రెండో వారం నుండి కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టనున్నారు. ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం రష్మికను తీసుకుంటున్నట్టు సమాచారం. త్రివిక్రమ్ ఇప్పటి వరకు తీసిన సినిమాల్లో ఇంత వరకు ఐటెం సాంగ్ లేదు. తొలిసారిగా రష్మికతో తన సినిమాలో ఐటెం సాంగ్ చేస్తున్నారు. మరి ఈ ఐటెం లో రష్మిక ఏ రేంజ్ లో అందాల ఆరబోత చేస్తుందో చూడాలి. గతంలో మహేష్ సరసన సరిలేరు నీకెవ్వరూ మూవీ లో రష్మిక హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు ఐటెం సాంగ్ లో చిందులేస్తుంది. ఇక త్రివిక్రమ్ – మహేష్ సినిమాలో మహేశ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.