ఏపీకి కేంద్ర సహకారం అవసరం ..అందుకే బిజెపి తో పొత్తు – అయ్యన్న

ayyanna patrudu
ayyanna patrudu

రాష్ట్రంలో పెద్దగా ఉనికిని లేని బిజెపి తో టిడిపి కూటమి పొత్తు పెట్టుకోవడం ఫై చాలామంది భిన్న అభిప్రాయాలూ వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బీజేపీతో పొత్తును స్వాగతిస్తున్నానని టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. ఏపీ తిరిగి కోలుకోవాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం తప్పనిసరి అని అన్నారు. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు. అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని నెట్టేశారని మండిపడ్డారు.

గత మూడు రోజులుగా చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లు ఢిల్లీ లో మకాం వేసి బిజెపి నేతలతో పొత్తులకు సంబదించిన చర్చలు జరిపి..పొత్తు ఫిక్స్ చేసారు. పదేళ్లుగా దేశ అభివృద్ధికి విస్తృత కృషి చేస్తున్న ప్రధాని మోదీ నేతృత్వంలో కలిసి పని చేందుకు టీడీపీ, జనేసన ముందుకు వచ్చాయన్నారు నడ్డా. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను తీర్చేలా మోదీతో కలిసి టీడీపీ, జనసేన కృషి చేస్తాయన్నారు.

టీడీపీ , బీజేపీ మధ్య గతంలోనూ మంచి సంబంధాలు ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. 1996లోనే టీడీపీ ఎన్డీఏలో చేరిందన్నరు. వాజ్ పేయి.. నరేంద్రమోడీ నాయకత్వాల్లోని ప్రభుత్వాల్లో టీడీపీ భాగమయిందన్నారు. 2014లో టీడీపీ, బీజేపీ కలిసి ఎన్నికల బరిలో నిలిచాయన్నారు. 2014 ఎన్నికల్లో జనసేన పార్టీ మద్దతు తెలిపిందన్నారు. ఒకటి రెండు రోజుల్లో సీట్ షేరింగ్ పూర్తవుతుందన్నారు.