హన్మకొండ లో ఘోర ప్రమాదం ..రైలు ‘ఢీ’ కొని 80 గోర్రెలతో పాటు గొర్రెల కాపరి మృతి

హన్మకొండ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రైలు ఢీకొని 80 గోర్రెలతో పాటు గొర్రెల కాపరి మృతి చెందిన విషాద సంఘటన శాశంపేట రైల్వే గేటు వద్ద చోటు చేసుకుంది. రైలు వస్తున్న క్రమంలో గేటు వేయగా.. కాపరి గొర్రెలను కొట్టుకుని ట్రాక్ దాటే ప్రయత్నం చేశారు. కానీ రైలు అనుకున్నదానికంటే వేగంగా రావడంతో గొర్రెలు పట్టాలపైన ఉండిపోయాయి. వాటిని పట్టాల నుంచి తప్పించే క్రమంలో కాపరిని కూడా రైలు ఢీకొట్టిగా అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదం అనంతరం రైలు పట్టాలపై గొర్రెల మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండటం అక్కడి ప్రజలను దు:ఖానికి గురి చేసింది.