రాజకీయ ప్రవేశంపై రాజనీకాంత్‌ ప్రకటన

జనవరిలో కొత్త పార్టీ లాంచ్..రజినీ ట్వీట్‌

Rajinikanth

చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది ఆయన రాజీకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు రజనీకాంత్‌ ట్విటర్‌ వేదికాగా ప్రకటించారు. జనవరిలో రాజకీయ పార్టీని ప్రారంభిస్తానని, అందుకు సంబంధించిన వివరాలను డిసెంబరు 31న ప్రకటిస్తానని రజనీకాంత్‌ వెల్లడించారు.

కాగా , కిడ్నీ మార్పిడి వ‌ల‌న ర‌జ‌నీకాంత్ రాజ‌కీయాల‌లోకి రాడ‌ని, ఇటీవ‌ల జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో త‌లైవా చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణ మండపంలో తన పార్టీ రజనీ మక్కళ్‌ మండ్రం (ఆర్‌ఎంఎం) జిల్లా కార్యదర్శులతో సమావేశమై చర్చించారు. అనంతరం పోయెస్‌ గార్డెన్‌లోని తన నివాసం వెలుపల విలేకరులతో మాట్లాడారు. వాళ్ల (ఆర్‌ఎంఎం కార్యదర్శులుా) అభిప్రాయాలను వాళ్లు చెప్పారని, తన అభిప్రాయాన్ని తాను తెలియజేశానని రజినీ తెలిపారు. ‘నా నిర్ణయం ఏదైనా సరే నా వెంటే ఉంటానని వాళ్లు చెప్పారు. నా నిర్ణయాన్ని వీలైనంత త్వరగా వెల్లడిస్తాన’ని చెప్పారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/