నేడు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్ విచారణ

ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తనకు సమన్లు జారీ చేయడాన్ని ఆమె సుప్రీంకోర్టులో సవాల్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఈరోజు సుప్రీం కోర్ట్ లో దీనిపై విచారణ చేపట్టనుంది. ఇప్పటికే కవిత పిటిషన్ పై ఈడీ కేవియెట్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో, ఇరువురి వాదనలు విన్న తర్వాత సుప్రీం ధర్మాసనం ఉత్తర్వులు ఇవ్వనుంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత సౌత్ గ్రూప్ లో ఉందని ఈడీ పేర్కొంటుండడం తెలిసిందే. కవితను ఈడీ ఇప్పటికే మూడుసార్లు ప్రశ్నించింది.

జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం కవిత పిటిషన్ పై నేడు విచారణ చేపట్టనుంది. తనకు ఈడీ సమన్లు ఇవ్వడాన్ని కవిత సవాల్ చేశారు. ఈడీ సమన్లు రద్దు చేయాలని, మహిళలను ఇంటి వద్దే విచారణ చేయాలని, తనకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కవిత కోరారు. ఈడీ విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలన్నది కవిత విజ్ఞప్తి. ఈడీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని పిటిషన్‌లో కవిత పేర్కొన్నారు. మరి దీనిపై సుప్రీం ఎలా స్పందిస్తుంది? విచారణపై స్టే విధిస్తుందా? లేక దర్యాప్తులో జోక్యం చేసుకోవడానికి నో చెబుతుందా ? లేక మహిళ అన్న కోణంలో ఏమైనా వెసులుబాట్లు కల్పిస్తుందా అనేది చూడాలి.