RC15 : టైటిల్ ప్రకటించిన మేకర్స్

ఆర్ఆర్ఆర్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని గ్లోబర్ స్టార్ గా మారిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..ఈరోజు తన 38 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భాంగా RC15 మూవీ మేకర్స్ టైటిల్ ప్రకటన చేసి మెగా అభిమానుల్లో సంబరాలు నింపారు. ప్రస్తుతం చరణ్..డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. ఈ మూవీ లో చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈరోజు చరణ్ బర్త్ డే సందర్బంగా సినిమా తాలూకా టైటిల్ ను ప్రకటించారు మేకర్స్ .

ఈ చిత్రానికి ‘గేమ్ చేంజర్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఈ సినిమా టైటిల్ కోసం ఎప్పట్నించో ఎదురుచూస్తున్న అభిమానులకు రామ్ చరణ్ పుట్టినరోజున సరైన ట్రీట్ ఇచ్చినట్టయింది. ఈ మూవీ లో శ్రీకాంత్, సునీల్, అంజలి, నవీన్ చంద్ర, ఎస్ జే సూర్య తదితరులు నటిస్తుండగా థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

YouTube video