ఊపిరితిత్తుల జాగ్రత్త కోసం..

యోగాతో ఆరోగ్యం

మనం కొన్ని వైరస్ లతో ఇన్ఫెక్షన్ ప్రభావానికి కుదేలైన ఊపిరితిత్తులు కోలుకోవటానికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఇందుకోసం ప్రాణాయామంతో పాటు ఊపిరితిత్తులను బలపరిచే కొన్ని వ్యాయామాలు చేయాలి.

praanaayaamam


ప్రాణాయామం:

బొటనవేలితో కుడి నాసికా రంధ్రాన్ని మూసి, ఎడమ నాసికా రంధ్రంతో గాలి పీలుస్తూ నాలుగు అంకెలు లెక్క పెట్టాలి.. తర్వాత ఎడమ నాసికా రంధ్రాన్ని కూడా మూసి 16 అంకెలు లెక్కపెట్టాలి.. తర్వాత కుడి నాసికా రంధ్రాన్ని తెరచి, 8 అంకెలు లెక్కపెడుతూ పూర్తిగా ఊపిరి వదలాలి.. ఎడమ నాసికా రంధ్రాన్ని మూసి ఉంచి, కుడి నాసిక ద్వారా నాలుగు అంకెలు లెక్కపెడుతూ ఊపిరి పీల్చాలి. రెండు నాసికాయ రంధ్రాలూ మూసి ఉంచి, 16 అంకెలు లెక్క పెట్టేవారకూ శ్వాసను నిలిపి ఉంచాలి.. ఎడమ నాసికా రంధ్రాన్ని తెరచి, 8 అంకెలు లెక్క పెట్టేవరకూ శ్వాస వదలాలి..

స్పైరో మెట్రీ :

పరికరాన్ని నూతిలో ఉంచుకుని, పెదవులతో బిగించి పట్టుకోవాలి. ఇండికేటర్ గోల్ మార్కర్ ను తాకేదాకా నెమ్మదిగా శ్వాస పీల్చుకోవాలి. గాలిసి పీల్చుకోలేని పరిస్థితి తలెత్తి నపుడు పరికరాన్ని నోట్లో నుంచి తొలగించి, కనీసం 3 సెకండ్స్ పాటు గాలిని బిగబట్టి ఉంచి శ్వాస వదలాలి.. వైధ్యులు సూచించినన్ని సార్లు స్పైరో మెట్రీ ని ఈ విధంగా ఉపయోగించాలి.. లెవెల్స్ ను నమోదు చేయటం వల్ల వైద్యులు ఊపిరితిత్తుల సామర్ధ్యాన్ని అంచనా వేయగలుగు తయారు.. కాబట్టి ఆ వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ ఉండాలి.

బెలూన్ వ్యాయామం :

రోజు మొత్తంలో వీలైనన్ని బెలూన్లను ఊడటం వలన, డయాఫ్రామ్ , రిబ్ కేజ్ ల సంకోచ వ్యాకోచాలు తోడ్పడే కండరాల సామర్ధ్యం పెరుగుతుంది.. ఎక్కువ ఆక్సిజన్ పీల్చుకోవటం వలన శ్వాసపరమైన ఇబ్బందులు ఎదుర్కునే సమస్య తప్పుతుంది. అలసట, నిస్సత్తువలు కూడా తగ్గుతాయి..

‘ఆధ్యాత్మికం ‘ వ్యాసాల కోసం : https://www.vaartha.com/category/specials/devotional/