వ్యాధులపై బ్రహ్మాస్త్రం వేప

పెరట్లో చెట్ల విశిష్టత

Neem Tree

వేప చెట్టు ప్రపంచంలోనే అరుదైన వృక్షాల్లో ఒకటి. ఈ చెట్టు వేరు నుంచి ఆకు వరకూ అన్ని ఔషధాలే. అలాంటి వేప నేడు ప్రపంచ మహామ్మారి నుంచి కాపాడుకునేందుకు ఉపయోగపడే సాధనమని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

4500 ఏళ్ల నుండి వేప వాడుకలో ఉందంటే ఆశ్చర్యపోవడం మన వంతే అవుతుంది. ఇది అందించే ప్రయోజనాలు అపారం. రక్తాన్ని శుద్ధి చేస్తుంది.

విష పదార్థాలను బయటకు పంపిస్తుంది. కీటకాల కాటుకి, అల్సర్లకి మందులా పనిచేస్తుంది.

శరీరంలో చెడు బాక్టీరియా వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తుంది. కురుపులు, కాలిన గాయాలు, ఇన్ఫెక్షన్ల, ఇతరత్రా చర్మ సంబంధిత సమస్యలను పోగొడుతుంది.

ఇన్ఫెక్షన్‌కి కారణమయ్యే బాక్టీరియాను చంపేయడమే కాదు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ఇవే కాదు ఇంకా చాలా ఆరోగ్య ప్రయోజనాలను వేప అందిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచే టానిక్‌గా వేపను ఉపయోగించుకోవచ్చు.

వేపలో ఉండే యాంటీ బాక్టీరియా, యాంటీ మైక్రోబయల్‌ గుణాలన్నీ శరీరానికి అందాలంటే ఉన్న మంచిదారి ఇదే. కొన్ని వేపాకులు తీసుకుని బాగా నలిపి గ్లాసు గోరువెచ్చని నీళ్లలో వేసి టీ తాగినట్లు తాగాలి.

ఇలా రోజూ చేస్తే కొంతకాలానికి రోగనిరోధకశక్తి పెరిగే చాన్స్‌ ఉందని నిపుణుల సూచిస్తున్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం:https://www.vaartha.com/andhra-pradesh/