ఆనందంగా తినాలన్పించే కుకీస్‌

వెరైటీ వంటకాలు

కరోనాతో పిల్లలు ఇంటి దగ్గరే ఉంటున్నారు. కొత్త సంవత్సరం కూడా వచ్చేసింది. వారికి ఏదో ఒకటి చేయాలిగా.. సరదాగా బిస్కెట్స్‌ చేసి..అందరూ ఆనందంగా తింటే బావుంటుందేమో కదా. ప్రయత్నించి చూడండి.

Wheat cookies

గోధుమ కుకీస్‌

కావలసినవి :
గోధుమ పిండి-అర కప్పు, కరిగించిన నెయ్యి/ వెన్న-3 స్పూన్లు ఉప్పు- చిటికెడు, పంచదార/ బెల్లంపొడి-2 టేబుల్‌ స్పూన్లు, వెనిలాఎసెన్స్‌
అరటీ స్పూన్లు

తయారు చేయువిధానం : – ప్రెజర్‌ కుకర్‌ లేదా మందపాటి అడుగు ఉన్న పాత తీసుకోవాలి. – ఒక పొరలాగ ఉప్పు లేదా ఇసుక వేసి, దాని మీద స్టాండు అమర్చలి

  • ముందుగా కుకర్‌ను పెద్ద మంట మీద పది నిమిషాలు వేడి చేయాలి. – ఒక పాత్రలోకి కరిగించిన నెయ్యి, పంచదార లేదా బెల్లం పొడి, వెనిలా ఎసెన్స్‌, ఉప్పు తీసు కుని బాగా కలపాలి గోధుమ పిండి జత చేసి మరోమారు కలిపి, మైత పెట్టి, పది నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచాలి
  • మిశ్రమాన్ని బయటకు తీసి, సమాన పరిమాణంలో ఉండల చేసి చేతితో గుండ్రంగా అదమాలి (కావాలనుకుంటే ఫోర్క్‌ సహాయంతో డిజైన్‌ గీసుకోవచ్చు) – అల్యూమినియం పాత్రకు నెయ్యి లేదా వెన్న పూయాలి. – తయారు చేసి ఉంచుకున్న కుకీలను ఇందులో దూరం దూరం ఉండాలి
  • మంట బాగా తగ్గించి, పదియేను నిమిషాల తరువాత స్టౌ మీద నుంచి దించేయాలి. – పది నిమిషాల తరవాత కుకర్‌ మూత తీయాలి. –
  • కుకీలను జాగ్రత్తగా బయటకు తీసి, గ్రిల్‌ వంటి దాని మీద జాగ్రత్తగా ఆరబెట్టాలి – పూర్తిగా చల్లారిన తరు వాత కుకీలను గాలిచొరని డబ్బాలో భద్రపరచాలి.

క్యారట్‌ ఆపిల్‌ కుకీస్‌

Carrot Apple Cookies
Carrot Apple Cookies

కావలసినవి : మైదాపిండి- 2 కప్పులు, బేకింగ్‌ పౌడర్‌-టీ స్పూను, ఉప్పు-అటీ స్పూను, అల్లంముద్ద – టీ స్పూను, జాజికాయ పొడి – చిట ికెడు, బటర్‌ (ఉప్పులేనిది)- ముప్పావు కప్పు, పంచదార-అర కప్పు కంటె కొద్దిగా ఎక్కువ, బ్రౌన్‌ సుగర్‌-పావు కప్పు, కొడిగుడ్డు-1, వెనిలా ఎసెన్స్‌- అర టీ స్పూను, క్యారట్‌ తురుము-కప్పు, ఆపిల్‌ తురుము- అరకప్పు.

తయారీ : ఒక పాత్రలో మైదా పిండి, బేకింగ్‌ పౌడర్‌, ఉప్పు, అల్లం ముద్ద, దాల్చినచెక్క పొడి, జాజికాయపొడి వేసి బాగా కలపాలి. – మరో పాత్రలో బటర్‌వేసి మెత్తగా అయ్యేలా గిలకొట్టాలి పంచదార, బ్రౌన్‌ సుగర్‌ జత చేసి మరో రెండు నిమిషాల సేపు గిలకొట్టాలి. – కోడి గుడ్డుసొన జత చేసి మరో మారు గిలకొట్టాక, వెనిలా ఎసెన్స్‌ జత చేసి బాగా కలపాలి

చివరగా మైదా పిండి మిశ్రమం జతచేసి నెమ్మదిగా గిలకొడుతూ మిశ్రమం మెత్తగా గట్టిగా వచ్చేలా చేయాలి. – రబ్బర్‌ స్పూన్‌తో కలుపుతూ క్యారట్‌ తురుము, ఆపిల్‌ తురుము కూడా జతచేసి మిశ్రమం అంతా బాగా కలిసేలా చేయాలి. – గుండ్రంగా కట్‌చేసి, వేడి చేసి ఉంచుకున్న కుకర్‌లో ఉంచి సుమారు ఇరవై నిమిషాలు సన్నని మంట మీద ఉంచి, దించేయాలి.- చల్లారిన తరవాత ప్లేట్లోకి తీసుకుని, మరింత చల్లారాక గాలిచొరని డబ్బాలోకి తీసుకోవాలి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/