ఒత్తిడి కారణంగా ఆరోగ్య సమస్యలు
ఆరోగ్యం-జాగ్రత్తలు

పని నుంచి బంధాల వరకూ ఏదైనా కూడా ఒత్తిడికి కారణం కావొచ్చు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే దీర్ఘకాల ఒత్తిడి ఆరోగ్యాన్ని చిన్నాభిన్నం చేయడమే కాదు దాని ప్రభావం చర్మం, వెంట్రుకల మీద బాగా పడుతుంది. అదెలాగంటే..
ఒత్తిడి వల్ల కోర్టి సాల్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. దీన్ని స్ట్రెన్ హార్మోన్ అని కూడా అంటారు. ఇది. చర్మం ముడతలు పడడానికి కారణ మవుతుంది.
ఒత్తిడి హార్మోన్ శరీరమంతటా మంటపుట్టిస్తుంది. దీని వల్ల మనం తొందరగా బ్రేకవ్ఞట్ అవుతుంటాం. ఒత్తిడి వల్ల చర్మంపై యాక్నే తలెత్తుతుంది.
స్ట్రెస్ కారణంగా చర్మంలో రకరకాల సమస్యలు తలెత్తుతాయి. ఎగ్జిమా లేదా సొరియాసిస్ వచ్చే అవకాశం ఉంది.ఒత్తిడి అధికమవుతే సమస్యలు మరింత తీవ్రతరమవుతాయి.
ఒత్తిడి కారణంగా చర్మం మీద శ్రద్ధ తీసుకోం. అంటే ఎక్స్‌పొయిలే షన్, మాయిశ్చరైజేషన్, సన్‌స్క్రీన్ విషయాలలో ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోలేము. ఫలితంగా చర్మం బాగా డల్ అయి రూపురేఖలు కాంతి విహీనంగా మారతాయి.
ఒత్తిడి కారణంగా మాడుకు రకరకాల సమస్యలు తలెత్తుతాయి. ఒత్తిడి వల్ల మాడు పొడారినట్టవ్ఞతుంది. లేదా బాగా జిడ్డుగా తయారవ్ఞతుంది. దీని వల్ల చుండ్రు, దురద లాంటి సమస్యలు తలెత్తుతాయి.తాజా ఒత్తిడి కారణంగా మాడుకు రకరకాల సమస్యలు తలెత్తుతాయి. ఒత్తిడి వల్ల మాడు పొడారినట్టవ్ఞతుంది. లేదా బాగా జిడ్డుగా తయారవ్ఞతుంది. దీని వల్ల చుండ్రు, దురద లాంటి సమస్యలు తలెత్తుతాయి.
తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/