పట్టు చీరపై మరకలు సులువుగా పోవాలంటే..
మహిళలకు చిట్కాలు
పండగలు , వ్రతాల సమయంలో మహిళలు పట్టు చీరలు కట్టందే జరగవు.. కానీ వాటిపై ఏవైనా మరకలు పడితే మాత్రం మనసు చివుక్కు మంటుంది.. వాటిని సులువుగా తొలగించే చిట్కాలివి.

పట్టు వస్త్రాలపై చాక్లెట్ మరకలు పడితే గోరువెచ్చని నీళ్లలో జాడించి ఉతికితే పోతాయి.. పెరుగు, వెన్న వంటి మరకలు పడితే మాత్రం మరకపై ఒక చుక్క కార్బన్ టెట్రా క్లోరైడ్ ను వేసి ఉతకాలి.
కాఫీ, టీ లు పడితే పట్టు వస్త్రంపై మరక ఎబ్బెట్టుగా కన్పిస్తుంది.. ఇలాంటప్పుడు కార్బన్ టెట్రా క్లోరైడ్ ను అద్ది ఆపై ఉతికితే మరకలు పోతాయి.. అప్పటికీ పోకపోతే చన్నీటిలో కొద్దిగా హైడ్రోజన్ పెరాక్సయిడ్ ఆ నీటిలో ఉతికితే సరి.. అసలే వర్షాకాలం , పేరంటానికో, ఏదైనా కార్యక్రమానికో రోడ్డుపై నడిస్తే.. బురద మరకలు అంటడం ఖాయం.. వీటిని వదిలించటానికి కాస్త షాంపూ చాలు…
అదే షూ పాలిష్ మరకలు పడితే… కొద్దిగా లిక్విడ్ డిటర్జెంట్ వేసి రుద్దాలి.. ఆపై రబ్బింగ్ ఆల్కహాల్ వేసి మరోసారి మృదువుగా ఉతికి ఆరేయాలి . పట్టు వాటి మీద ఇంక్ లేదా లిప్ స్టిక్ , డిటర్జెంట్ మరకలు పడితే ఆ భాగంలో పేపర్ టవల్ ను ఉంచి వెనుక నుంచి డ్రై క్లీనింగ్ ద్రావణం లేదా ఆల్కహాల్ రాయండి.. మరక పూర్తిగా పోయే వరకు నీటిని వాడకూడదు. అదే నెయిల్ పాలిష్ పడితే అసిటోన్ లో ముంచితే సరిపోతుంది.
తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/category/telangana/