కరోనా కాలంలోనూ వైద్యం కరువు

గ్రామీణ ప్రజానీకం తీవ్ర ఇక్కట్లు

Primary Healthcare center (File)
Primary Healthcare center (File)

దేశసర్వతోముఖాభివృద్ధికి ఆరోగ్య సంరక్షణ కీలకం. ఉత్తమ ఆరోగ్య సంరక్షణ రంగం బలసంపన్నమైన దేశ నిర్మాణానికి ఉత్పత్తి లక్ష్యంగా గల శ్రామికశక్తి సూచనలకు తోడ్ప డుతుంది.

ఆర్థికాభివృద్ధిలో సరితూగే క్రమంలో ఆరోగ్యరంగంలో వికాసం చోటు చేసుకోలేదు.

మానవ జీవనయానం సుఖంగా జరగాలంటే ఆరోగ్యం విద్య రెండు చక్రాల వంటివి. దేశాభివృద్ధికి విద్యారంగంతోపాటు వైద్యరంగం పురోగతి ఎంతో అవశ్యకత ఆరోగ్యమైన దేశాభివృద్ధికి కీలకం.

భారతదేశంలో 11.493 వైద్య శాలలు, 1,76,820 ఆరోగ్య కేంద్రాలు, 1,48,124 ఆరోగ్య ఉపకేంద్రాలు, 23,887 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయనేది ఒక అంచనాలో వెల్లడైంది.

4,809 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌, బ్లడ్‌బ్యాంకుల సంఖ్య దాదాపు 2517 ఉన్నాయనేది వెల్లడైంది.

అయినప్పటికీ పెరుగు తున్న జనాభా అవసరాలకు సరిపడా లేక ఆరోగ్యరంగం అనా రోగ్యస్థితిలోకి జారుతుంది. ఇక ప్రైవేట్‌ కార్పొరేట్‌ ఆస్పత్రిలు రోగుల నిలువుదోపిడీ చేస్తున్నాయి.

రోగుల బంధువులకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాయి. చావును బూచిగా చూపించి నరకం చూపిస్తూ హడలెత్తిస్తున్నాయి.

గతంలో ఠాగూర్‌ సినిమా సీన్‌ కండ్లకు కట్టినట్లు కనిపిస్తున్నది. లేని రోగాలు సృష్టించి రోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మెడికో లీగల్‌ కేసులకు లక్షల రూపాయలు కాజేస్తున్నారు.

ఆస్పత్రులకు వచ్చిన రోగులు భయ భ్రాంతులకు గురవుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలు రోజురోజుకు దిగజారుతున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరో గ్యాన్ని గాలి కొదిలేసింది. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 70శాతం మంది ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.

వైద్యం సరిగ్గా అందక మృత్యువాతపడుతున్న సంఘటనలు కోకొల్లలు. పిహెచ్‌సిలు కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లు 30 పడకల ఆస్పత్రిలో వైద్యం అందని ద్రాక్షగా అయింది.

ప్రతి మండలానికి 30 పడకల ఆస్పత్రి టిఆర్‌ఎస్‌పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది.

అది ఇంతవరకు అమలుకాలేదు.ఇక మండలాల్లో 30 పడకల ఆస్పత్రి వైద్యం అందని ద్రాక్షే అయింది.

అందుబాటులో లేని వైద్యసిబ్బంది మందుల కొరతతో ప్రభుత్వ వైద్యంపట్ల జనానికి నమ్మకం సన్నగిల్లిపోతుంది.

ప్రభుత్వవైద్యం అంతంత మాత్రంగానే ఉండటంతో ప్రజలు ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.

సాధారణ జ్వరం టైఫాయిడ్‌ మలేరియా నుంచి ప్రాణాంతక వ్యాధు లతోపాటు ప్రమాదంలో గాయపడిన వాళ్లకు మెడికో లీగల్‌ కేసులను ఆస్పత్రిలో సదుపాయాలు లేవంటూ ప్రైవేట్‌ ఆస్పత్రికి పంపిస్తున్నారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రస్తుతం అందిస్తున్న వైద్యసేవల గురించి వైద్యశాఖ ఉన్నతాధి కారులు కూడా పట్టించుకోకపోవడం ఆందోళన కలిగిస్తుంది.

ఆస్పత్రిలో మొక్కుబడి తనిఖీలు వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండటం లేదు.

104 వాహనాల ద్వారా షుగర్‌ బిపివంటి జబ్బులకు మందుల పంపిణీకి మంగళంపాడటంతోపాటు ఏజెన్సీ మైదాన ప్రాంతాల్లో గ్రామీణులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు.

ఆరోగ్యశ్రీ పథకంలో కూడా కొన్ని రోగాలకు వైద్యం చేస్తుండడంతో రోగులు ప్రైవేట్‌ వైద్యం వైపు పరుగులు పెట్టక తప్పడం లేదు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆరోగ్య వైద్యసేవలు ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆస్పత్రులకు కక్కుర్తిపడి ప్రజల దగ్గర ఉన్నది దోచుకుంటున్నారు.

ప్రభుత్వవైద్యం వైఫల్యాల్లో ప్రైవేట్‌ ఆస్పత్రు లకు బాగా ఉపయోగపడుతున్నాయి. గ్రామాలతోపాటు పట్టణాల్లో కూడా పెద్దఎత్తు ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.

రాష్ట్రంలో గత 10 ఏళ్లలో వైద్య విద్య అభ్యసించిన వాళ్లు గణనీయంగా పెరిగారు.

ప్రైవేట్‌ కార్పొరేట్‌ ఆస్పత్రులకు డిమాండ్‌ ఉండడంతో పెద్దఎత్తున వీటిని ఏర్పాటు చేస్తున్నారు.

ఆస్పత్రులు ఎక్కువవడంతో ఈ వృత్తిలో పోటీ పెరిగింది. రోగుల కోసం ఆస్పత్రి వద్ద కాపలా కాస్తున్నారు.

కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రు ల్లో వైద్యంకోసం వైద్యులను ఏజెంట్లుగా మార్చేస్తున్నారు.

ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసే వారి సహాయంతో ఏజెంట్‌ ద్వారా రోగులు తమ ఆస్పత్రికి రప్పించుకుంటున్నారనేది నగ్నసత్యం.

గర్భిణీలకు చికిత్స విషయంలో ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వైద్యులు చాలా దారుణంగా వ్యవహరిస్తు న్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వైద్య వ్యవస్థని బలో పేతంచేసి దేశంలోని పేదప్రజానీకాన్ని ఆదుకోవాలి.

-మన్నారం నాగరాజు, (రచయిత: రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ లోక్‌సత్తాపార్టీ)

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/