యాప్‌ల నిషేధంపై స్పందించిన చైనా వాణిజ్య శాఖ

యాప్‌లపై నిషేధం నిర్ణయాన్ని భారత్‌ సరిచేసుకోవాలి.. చైనా వాణిజ్య శాఖ అధికార ప్రతినిధి గావో ఫెంగ్

China

బీజింగ్‌:  భారత‌ ప్రభుత్వం చైనాకు చెందిన 59 యాప్‌లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే చైనా వాణిజ్య శాఖ అధికార ప్రతినిధి గావో ఫెంగ్‌ గురువారం స్పందించారు. చైనా యాప్‌లపై నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని భారత్‌ సరిచేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. డ్రాగన్‌కు చెందిన కంపెనీల పట్ల వివక్ష పూరిత చర్యలు సరికావంటూ అక్కసు వెళ్లగక్కింది. భారత్‌ చర్యలు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలు ఉల్లంఘించేవిగా ఉన్నాయని పేర్కొన్నారు. తమ దేశంలో భారత ఉత్పత్తులు, సేవల పట్ల ఎలాంటి వివక్ష ప్రదర్శించడం లేదని.. భారత్‌ సైతం ఇదే విధంగా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నామన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/