‘మెట్రో’ స్పీడ్ పెంపునకు పచ్చ జెండా…
గంటకు 80-90 కి.మీ.కు అనుమతి

Hyderabad: మెట్రో రైళ్ల వేగం పెంపుదలకు సీఎంఆర్ఎస్ పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల పెంపునకు అనుమతి ఇచ్చింది. ఇదిలా ఉండగా, ఇటీవల మెట్రో రైళ్ల వేగం, భద్రతపై తనిఖీలు జరిపిన కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్వే సేఫ్టీ సంతృప్తి వ్యక్తం చేసింది. మెట్రో వేగం పరిమితి పెంపుతో ప్రయాణ సమయం ఆదా అవుతుందని తెలిపారు. నాగోలో – రాయదుర్గం వద్ద 6 నిమిషాలు, మియాపూర్ – ఎల్బీ నగర్ మధ్య 4 నిమిషాలు, జేబీఎస్ – ఎంజీబీఎస్ మధ్య ఒకటిన్నర నిమిషాల సమయం ఆదా అవుతుందని అధికారులు వెల్లడించారు.
క్రీడా వార్తల కోసం : https://www.vaartha.com/news/sports/