నా జీవితంలో రాకెట్ రూపకల్పనలో ఎన్నో తప్పులు చేశానుః ఇస్రో ఛైర్మన్ సోమనాథ్‌

isro-chairman-somanath-receives-honorary-doctorate-from-jntu-hyderabad

హైదరాబాద్‌ః హైదరాబాద్ జేఎన్‌టీయూ స్నాతకోత్సవంలో ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ పాల్గొన్నారు. ఆయనకు జేఎన్‌టీయూ వీసీ కట్ట నరసింహారెడ్డి గౌరవ డాక్టరేట్ అందించారు. ఈ సందర్భంగా సోమనాథ్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీ వృద్ధి, హెరిటేజ్లో హైదరాబాద్ ఉన్నత స్థానంలో ఉందని అన్నారు. ఎలాంటి పరిస్థితులనుఅయినా ఎదుర్కొనే సామర్థ్యం ఉండాలని చెప్పారు. మంచి టెక్నాలజీని తక్కువ ఖర్చుతో ఎలా ఆవిష్కరించగలమో ఆలోచించాలని విద్యార్థులకు సూచించారు.

అంతరిక్ష రంగం ప్రతి ఒక్కరినీ ఎంతగానో ఆకర్షిస్తుంది. అందుకే చంద్రయాన్-3 పై ఎంతో ఆసక్తి నెలకొంది. ఎంతోమందికి చంద్రయన్ 3 ప్రయోగం ఉపయోగం గురించి మొత్తం తెలియకపోవచ్చు. కానీ ఈ ప్రయోగం అందరిని ఎంతో గుర్వించేలా చేసింది. గత 60 ఏళ్లుగా ఇస్రో ఎంతో కృషి చేస్తోంది. స్పేస్ రంగంలో మరిన్ని అంకురాలు, ఇండస్ట్రీస్ రావాల్సిన అవసరం ఉంది. నా జీవితంలో ఎన్నో పరాజయాలు చూశాను. పరాజయం పొందినప్పుడు ఎవరు మిమ్మల్ని పట్టించుకోరు. నా జీవితంలో రాకెట్ రూపకల్పనలో ఎన్నో తప్పులు చేశాను. వాటి నుంచి పాఠాలు నేర్చుకుని గెలుపు తీరాలకు చేరాను. అని సోమనాథ్ తెలిపారు.