తెలంగాణ ప్రభుత్వోద్యోగులకు శుభవార్త

జూన్ నెల నుంచి ఉద్యోగులకు పూర్తి జీతాలు..హరీశ్ రావు

Harish Rao
Harish Rao

హైదారాబాద్‌: కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ప్రభుత్వ ఖజానాలకు గండి పడి..ప్రభుత్వోద్యోగుల జీతాల్లో తెలంగాణ ప్రభుత్వం కోత విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పబ్లిక్ సెక్టార్, పెన్షనర్లు, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక తరపున ప్రతినిధులు ఆర్థిక మంత్రి హరీశ్ రావును కలిశారు. తమ సమస్యలను మంత్రికి వివరించారు. వీరి విన్నపాల పట్ల హరీశ్ రావు సానుకూలంగా స్పందించారు. అనంతరం ఐక్యవేదిక ప్రతినిధులు ఒక ప్రకటనను విడుదల చేశారు. అందరికీ జూన్ నెల నుంచి పూర్తి వేతనాలను చెల్లించేందుకు మంత్రి అంగీకరించారని వెల్లడించారు. రిటైర్డ్ ఉద్యోగులకు పూర్తి పెన్షన్లు ఇస్తామని చెప్పారని తెలిపారు. బకాయిలను జీపీఎఫ్ ఖాతాలో జమ చేయాలనుకుంటున్నట్టు తెలిపారని చెప్పారు. అయితే ఉద్యోగులు, ఉపాధ్యాయులు వేతన బకాయిలను జీపీఎఫ్ లో కాకుండా… నగదు రూపంలోనే ఇవ్వాలని మంత్రిని కోరామని తెలిపారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/