జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు

పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారంటూ కేసు నమోదు

JC Prabhakar Reddy
JC Prabhakar Reddy

అమరావతిః టిడిపి నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాడిపత్రి పట్టణంలో 30 యాక్ట్ అమల్లో ఉన్నప్పటికీ… అనుమతి లేకుండా టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట చట్ట విరుద్ధంగా నిరసన తెలిపారంటూ ఆయనతో పాటు మరో 120 మంది అనుచరులపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే… టిడిపి కౌన్సిలర్లపై వైఎస్‌ఆర్‌సిపి నేతలు దాడులు చేస్తున్నారంటూ తన అనుచరులతో కలిసి జేసీ ప్రభాకర్ రెడ్డి ధర్నా చేపట్టారు. వైఎస్‌ఆర్‌సిపి ఆగడాలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారంటూ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో అనుమతులు లేకుండా ఆందోళనకు దిగి, ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారంటూ వీరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/