గురువే ప్రత్యక్ష దైవం

ఆధ్యాత్మిక చింతన

Shirdi Sai Baba

సాయిబాబా, రాఘవేంద్రస్వామి, రమణమహర్షుల వలె గురువు దైవాలు ఒకేరూపంలో సామాన్యంగా కనిపించరు. పాండురంగని అంకితభక్తుడు నామదేవుడు.

వామదేవుడు తన బాల్యంనుండి పాండురంగనితో ఆడిపాడేవాడు.

నామదేవుడు తన గురువు యొక్క ప్రాశ్చస్తం తెలియదు. పాండురంగడే నామదేవుని శివాలయంలో ఉన్న గురువును సేవింపుమని ఆదేశిస్తాడు.

స్వామీ శంకర్‌రాజ్‌దాన్‌ కాశ్మీర్‌ దేశపు మహాయోగి. ఆయన తండ్రి కూల్‌గాంలో ఉద్యోగం చేస్తుండేవాడు.

కూల్‌గాం ఒక చక్కని ప్రదేశం. అచటి అందచందాలకు స్వామిశంకర్‌ పరవశించిపోయాడు. ఆ ప్రకృతిలోనే ఉమాభగవతిదేవిని ఆరాధించాడు. అతనికి కూలగాంలో ఉన్న ఖీరభవానీ దేవి ఆలయంలో తపస్సు చేద్దామనుకున్నాడు.

ఆలోచన రావటమే తడవుగా అతడు భవానీదేవి ఆలయానికి కాలినడక సాగించాడు. అడుగులు వేయటం ప్రారంభించాడో లేదో ఆకాశమంతా ఉరుములు, మెరుపులతో ప్రతిధ్వనించసాగింది.

Sai Saranam

కాని సమయంలో వచ్చిన ఈ ప్రకృతి భీభత్సానికి సరియైన కారణం ఏదో ఉంటుందన్న ఆలోచన వచ్చింది. అయినా స్వామిశంకర్‌ అడుగులు తడపడలేదు.

దూరంగా ఒక కొండపైన దేవి కూర్చున్నట్లు తనను రమ్మని పిలుస్తున్నట్లునిపించింది. ధైర్యంగా వెళ్లాడు. ఎంతకాలం నీవు గురువు లేకుండా దైవాన్వేషణ సాగిస్తావు.

కాశ్మీరులోని స్వామి జనార్ధన్ధర్‌ నీ గురువు. నీవువెళ్లి ఆయననుసేవించు అని అమ్మ ఆదేశం ఇచ్చింది.

ప్రకృతి ప్రశాంతమయింది. అమ్మ ఆదేశం ప్రకారం జనార్ధన్‌ధర్‌ గురువును చేరాడు. ఆయన ఇతడిని శిష్యబృందంలో చేర్చుకున్నాడు గురుకులంలోనే.

  • యం.పి.సాయినాధ్‌

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/