గాలిలోనే బంగాళదుంప సాగు

పెరటిలో కూరగాయల పెంపకం

Potato cultivation
Potato cultivation

బంగాళ దుంప ఎక్కడ పండుతాయని అడిగితే మట్టిలో వల అని చిన్నపిల్లాడైనా చెబుతాడు. మరి, గాలిలోనూ పండుతాయి అని ఎప్పుడైనా విన్నారా? ఆశ్చర్యమేస్తుంది కదూ

హరియాణాలో శ్యాంగఢ్‌ గ్రామంలోని పొటాటో టెక్నాలజీ కేంద్రంలో ఏరోపోనిక్‌ విధానంలో బంగాళదుంపల్ని గాలిలోనే సాగుచేస్తున్నారు.

దీనికోసం మొదట గ్రీన్‌హౌస్‌ పదలితిలో బంగాళదుంప విత్తనాల ద్వారా మొక్కల్ని పెంచుతారు. ఆ తరువాత ప్రత్యేక గదుల్లో పైభాగంలో ఏర్పాటు చేసిన పెట్టేలో ఆ మొక్కల్ని ఉంచుతారు.

ఆ మొక్కల వేరు కిందికి వ్రేలాడే పెట్టే లకు రంధ్రాలు చేస్తారు.

ఇలా వేలాడే వేర్లకే బంగాళ దుంపలు కాస్తుంటాయి. మొక్కలు, వేర్లూ ఎండిపో కుండా క్రమం తప్పకుండా వీటినీ, అవసరమైన పోషకాల్నీ అందిస్తారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/