పరమ పవిత్రం: శివరాత్రి పర్వదినం

ఆధ్యాత్మికం

మాఘమాసం బహుళ చతుర్దశినాడు మహా శివరాత్రి పర్వదినాన్ని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.. శివునికి చతుర్థి తిధి పూజలు అత్యంత ప్రీతికరం.. శ్రీ మహా విష్ణువు , బ్రహ్మ దేవుడు మధ్య సంభవించిన కలహాన్ని అంతం చేయటానికి పరమేశ్వరుడు మొట్టమొదట లింగ రూపం ధరించింది శివరాత్రి రోజునే అని మన పురాణాలు చెబుతున్నాయి.

ఈ రోజు త్రినేత్రుని దివ్యరూపం కోటి కాంతులై ప్రజ్వరిల్లు తుంది. లింగోద్భవం సమయంలో శివారాధనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. శివరాత్రి అంటే మంగళకరమైన రాత్రి.. ఈ శుభకరమైన శివ రాత్రి రోజున శివ పార్వతులు కైలాసంలో ఆనంద తాండవం చేసే శుభ సమయాన కోరిన కోరికలు నెరవేరి సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్ముతారు.. ఈ రోజున పవిత్ర స్నానాలు, అభిషేకాలు, ఉపవాసం ఉంటూ జాగారం చేస్తే పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుందని భక్తుల నమ్మకం..

త్రిపురాసుర సంహార్ధమై శివుడు చేసిన ఘోర తపస్సు కారణంగా ఆయన కంటి నుండి ఉద్భవించిన నీరు భూమిపై పడి రుధ్రాక్షలుగా అవతరించాయని చెబుతారు.. వీటిని ధరించటం వలన అనేక శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. పార్వతి స్వేదం నుండి ఉద్భవించిన బిల్వ వృక్షాలు కూడా శివునికి ఏంటో ప్రీతికరమైనవి..

Kotappa konda trikoteswara Swamy

అనుగ్రహ ప్రదాత, మంగళ స్వరూపుడైన పరమేశ్వరుడులో పురుషుడి శక్తి సగం, ఆయన సతీమణి పార్వతి దేవి శక్తి సగం సమ్మేళనంగా ఉంటుంది.. సమస్త చరాచర ప్రపంచం శక్తి రూపం తోనే ఏర్పడింది.. కాబట్టి శక్తి రూపం లేకుండా శివుడు ఏమీ చేయలీడు.. అందుకే స్త్రీ, పురుషుడు కలిసి ఒకే రూపంగా ఏర్పడితేనే ఏదైనా సాధ్యం అవుతుంది.. ఈ విషయాన్ని మనకు తెలియ జేయటానికి శివుడు అర్ధ నారీశ్వర రూపాన్ని ధరించాడు.. ఒకరు ఎక్కువ , మరొకరు తక్కువ కాదని స్త్రీ, పురుషులిద్దరూ సమానమే అని తెలియజెప్పాడు..

Maha Shivaraatri pooja

‘ఓం నమః శివాయ ‘ ఈ పంచాక్షరీ మంత్రం పరబ్రహ్మ మయం. ఈ మంత్ర మహిమ గురించి ఈశ్వరుడే స్వయంగా చెప్పాడని మన పురాణాలు చెబుతున్నాయి.. ఈ మంత్రం పలికిన వారికి యెంత ఫలం కలుగుతుందో , విన్న వారికి కూడా అంటే ఫలితం కలుగుతుందని, తెలిసీ, తెలియక చేని పాపాలు , దోషాలు తలగిపోయి సుఖాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం..

అనుక్షణం ‘ ఓం నమః శివాయ’ అనే శివ పంచాక్షరీ మంత్రాన్ని పాటిస్తూ, మనసుని పవిత్రంగా , ప్రశాంతంగా ఉంచుకోవాలి.. ఈ పర్వదినాన శివాలయాల్లో లోక కళ్యాణార్ధం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం వేడుకగా జాగారం శివరాత్రినాడు చేయాల్సిన ముఖ్యమైన మూడు విధులు. భక్తి శ్రద్ధలతో నిర్మలమైన మనస్సుతో శివ తత్వాన్ని అర్ధం చేసుకుంటే మనిషిలో మానవత్వం పరిమళిస్తుంది.. ఈ శివ రాత్రి పర్వ దినాన ప్రజలందరికీ పరమేశ్వరుని అనుగ్రహం లభించాలని కోరుకుందాం..

  • కాయల నాగేంద్ర

‘చెలి’ (మహిళల ప్రత్యేకం) వ్యాసాల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/category/specials/women/