‘గుప్పెడంత మనసు’ హీరో రిషి ఇంట విషాద ఛాయలు

గుప్పెడంత మనసు సీరియల్‌ ఫేమ్ రిషి (ముఖేష్ గౌడ) ఇంట విషాదం నెలకొంది. కొన్నేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్న ముఖేష్ తండ్రి కన్నుమూశారు. తండ్రి మరణవార్త తెలియాగానే షూటింగ్ నుండి స్వగ్రామానికి చేరుకున్న ముకేశ్.. తండ్రితో తనకున్న జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. దీంతో ముఖేష్ ఫ్యాన్స్ సంతాపం తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్స్ పెడుతున్నారు. కొన్నేళ్లుగా ఇంటి దగ్గర్నుంచే చికిత్స అందించే ఏర్పాట్లు చేశాడు ముఖేష్. పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు.

ఓ అవార్డు ఫంక్షన్‌లో తన తండ్రిని అందరికీ పరిచయం చేశాడు ముఖేష్. ఆ సందర్భంలో తన తండ్రి గురించి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు. తన తండ్రి పక్షవాతంతో కదల్లేని స్థితిలో ఉంటే.. అన్నీ తానై చూసుకున్నాడు. “మా నాన్నను నేను నాకే పుట్టిన కొడుకులా చూసుకున్నాను.. అందరి జీవితంలో ఇది జరుగుతుందో లేదో నాకు తెలియదు. కానీ నా లైఫ్‌లో జరిగింది” అంటూ రిషి తండ్రిని చూసి చాలా ఎమోషనల్ అయ్యాడు. తండ్రికి తినిపిస్తూ, గడ్డం గీస్తూ.. అన్ని సేవలూ చేస్తూ ఎంతో ప్రేమగా చూసుకున్నాడు.