నలుగురు బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలనీ రేవంత్ డిమాండ్

మునుగోడు ఉప ఎన్నిక ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి పెంచుతుంది. ఈ ఉప ఎన్నిక ను అన్ని పార్టీ లు సవాల్ గా తీసుకున్నాయి. ఎలాగైనా ఉప ఎన్నిక లో గెలిచి తీరాలని కసరత్తులు చేస్తున్నాయి. ఈ క్రమంలో టీపీసీసీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..ఉప ఎన్నికలతోనే అభివృద్ధి జరుగుతుందంటే..తక్షణమే నలుగురు బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నలుగురు బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే 28 నియోజకవర్గాలో అభివృద్ధి జరుగుతుందన్నారు.

బీజేపీ, టీఆర్ఎస్ తోడు దొంగలుగా మారారన్నారు. సర్పంచ్ లు, ఎంపీటీసీలు రూ.40 లక్షలు, 50 లక్షలకు అమ్ముడుపోతున్నారన్నారు. అమ్ముడుపోయిన వాళ్లంతా అభివృద్ధి అని అంటున్నారన్నారు. ప్రజాస్వామ్యం గెలవాలంటే కాంగ్రెస్ గెలవాలన్నారు. తెలంగాణ ప్రజలంతా ఇవాళ మునుగోడు వైపు చూస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. ఇది ఒక ప్రత్యేక సందర్భమని అని..ఈ ప్రాంతానికి ఒక చరిత్ర ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడినా పాలకుల నిర్లక్ష్యం వల్ల నల్గొండలో ఫ్లోరైడ్ సమస్య తీరలేదన్నారు. 8 ఏళ్లైనా కేసీఆర్ ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం చూపించలేదన్నారు. ఎన్నికల మేనిఫేస్టోలో హామీలిచ్చినా నెరవేర్చలేదన్నారు.డబుల్ బెడ్రూం ఇళ్లు.. దళితులకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, రైతుకు లక్షరుణమాఫీ వంటి హామీలు నెరవేర్చలేదన్నారు.