మామిడితో ముఖ చర్మ సౌందర్యం

అందమే ఆనందం

వేసవి అంటే .. ఎర్రటి ఎండలకు భయపడ్డా .. కమ్మని నోరూరించే మామిడి పండ్ల కోసం ఎండ వేడిని భరించటానికి కూడా సిద్దమంటారు చాలా మంది..మామిడి కేవలం రుచే కాదు.. ఎన్నో సుగుణాలున్న పండు.. మోతాదు మించకుండా తింటే బోలెడన్ని ప్రయోజనాలు కలుగుతాయట.. అయితే కేవలం తినటం వల్లే కాదు మామిడి పండు గుజ్జును సౌందర్య పరిరక్షణకు ఉపయోగించటం వలన మెరిసే మోమును మన సొంతం చేసుకోవచ్చు.. మరి, మామిడి పండు గుజ్జు తో మన చర్మాన్ని , జుట్టును కాపాడుకునేందుకు ఎలాంటి ఫ్యాక్స్ వేసుకోవాలో తెలుసుకుందాం.


ముల్తానీ మట్టితో కలిపి :

మామిడిలో వున్నా సుగుణాల వలన ముఖ చర్మం నిగనిగ లాడుతుంది… ఇది చర్మాన్ని మృదువుగా మార్చటమే కాదు.. చక్కటి మెరుపు కూడా సొంతమయ్యేలా చేస్తుంది.. డీకే కోసం ఒక మామిడి పండు గుజ్జు తీసుకోవాలి… మామిడి పండు గుజ్జు తీసేటప్పుడు తొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. తొక్కను పేస్ ప్యాక్ లో రాకుండా చూసుకోవటం మంచిది.. ఎందుకంటే దీనివల్ల చర్మానికి దురదలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే కేవలం గుజ్జును మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.. ఈ మామిడి గుజ్జుకు సమాన పళ్లలో ముల్తానీ మట్టిని కలిపి మొత్తని పాస్టలా చేసుకుని దాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి.. అలా పావు గంట పాటు ఉంచుకొని ఆపై గుండ్రంగా మసాజ్ చేసుకుంటూ చల్లని నీటితో ప్యాక్ తొలగించుకోవాలి..

ఓట్స్ మీల్ తోనూ :

ఓట్స్ మీల్ మన ఆరోగ్యానికే కాదు.. చర్మానికి కూడా మంచి చేస్తుందన్న సంగతి తెలిసిందే… దీనికి మామిడి పండు గుజ్జును చేరిస్తే ఆ ప్రయోజనాలు మరింతగా పెరుగుతాయి.. దీనికోసం 7, 8 బాదాం పప్పులు ను నీటిలో నానబెట్టి పొట్టు తీసి , వాటికి రెండు టీ స్పూన్లు పాలు, కొద్దిగా ఓట్స్ , నీళ్లు , ముల్తానీ మట్టి, ఒక మామిడి పండు గుజ్జు కలిపి గ్రైండ్ చేసుకోవాలి.. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని పావు గంట పాటు ఉంచుకుని కడిగేస్తే సరిపోతుంది.. దీన్ని వారానికి రెండుసార్లు వేసుకుంటే ముఖం మెరుస్తూ కన్పిస్తుంది..

ట్యాన్ కి టాటా

ఎండా కాలంలో ఎక్కువుగా ఎదురయ్యేది ట్యాన్ సమస్య.. దేనికి వేసవిలో ఎక్కువుగా దొరికే మామిడి చక్కగా ఉపయోగపడుతుంది… ఇందుకోసం మామిడి పండు గుజ్జులో నాలుగు టేబుల్ స్పూన్లు సెనగ పిండి, 4,5 బాదాం పప్పుల పొడి, తేనె కలుపుకుని.. ఈ మిశ్రమాన్ని ఎండవల్ల నల్లగా మారిన భాగాల్లో అప్లై చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే త్యం తొలగిపోతుంది.. ఎప్పటికప్పుడు ఈ ప్యాక్ ని వేసుకోవటం వలన నల్లగా మారకుండా చర్మాన్ని కాపాడుకోవచ్చు..

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/category/andhra-pradesh/