రాజ్‌ఘాట్‌లో కేజ్రీవాల్ నివాళులు.. హోలీ వేడుకలకు దూరం

న్యూఢిల్లీః సిఎం కేజ్రీవాల్ నేడు రాజ్‌ఘాట్ వద్ద నివాళి అర్పించారు. పార్టీల నేత సత్యేంద్ర జైన్ , మనీష్ సిసోడియా లను కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్టు చేసిన నేపథ్యంలో ఆయన ఈరోజంతా పూజ నిర్వహిస్తున్నారు. తమ పార్టీ నేతల అరెస్టును ఖండిస్తూ ఆయన హోలీకి దూరంగా ఉన్నారు. పండుగను సెలబ్రేట్ చేసుకోవడం లేదన్నారు.
దేశానికి మంచి జరగాలన్న ఉద్దేశంతో పూజ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. దేశాన్ని లూటీ చేస్తున్నవాళ్లు పారిపోతున్నారని, కానీ మంచి చేస్తున్నవాళ్లను అరెస్టు చేస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.