టీటీడీ చైర్మన్ గా భూమన నియామకంపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకరన్ రెడ్డి ని జగన్ ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. రేపటి నుండి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. టీటీడీ చైర్మన్ అవ్వడం భూమన రెండోసారి. అయితే ఎన్నికల అఫిడవిట్ లో క్రైస్తవుడుగా పేర్కొన్న భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్ గా ఎలా నియమిస్తారంటూ ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇప్పటీకే దీనిపై పలువురు స్పందించగా..తాజాగా తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేసారు.

హింధూ ధర్మాన్ని ఏపీ సీఎం జగన్ చాలా తక్కువగా చూస్తున్నారంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల అఫిడవిట్ లో క్రైస్తవుడుగా పేర్కొన్న భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్ గా జగన్ నియమించారనీ, ఇది అత్యంత దారుణమైన చర్య అని అన్నారు. టీటీడీ చైర్మన్ గా హిందువులనే నియమించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఏపీలో హిందువులు మేలుకోవాలి లేకపోతే నష్టపోకతప్పదని అన్నారు. ఏపీలో హిందువుల పోరాటాలకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు.