గుంటూరు కారం నుండి ఫస్ట్ సాంగ్ వచ్చేసిందోచ్

సూపర్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గుంటూరు కారం నుండి మొదటి సాంగ్ వచ్చేసింది. ఈరోజు త్రివిక్రమ్ బర్త్ డే సందర్భాంగా మేకర్స్ సినిమాలోని ‘దమ్ మసాలా…’ అంటూ సాగే సాంగ్ ను రిలీజ్ చేసారు. ఈ సాంగ్ కు రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా సంజిత్ హెగ్డేతో కలిసి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ పాటను పాడటం విశేషం.

బుర్రిపాలెం బుల్లోడు అంటూ మహేష్ సొంతూరు గుర్తుకు తెచ్చారు. సుర్రు సురక ఈడు అంటూ హీరోతో పెట్టుకుంటే మామూలుగా ఉండదని ముందు హింట్ ఇచ్చారు. మాసీ సాహిత్యంతో సాంగ్ అంతా సాగింది. మధ్యలో త్రివిక్రమ్ మార్క్ కూడా కనిపించింది. ‘నేనో నిశ్శబ్దం… అనినిత్యం నాతో నాకే యుద్ధం’ లైనులో మాటల మాంత్రికుడి టేస్ట్ స్పష్టంగా వినబడుతోంది.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చిన బాబు) ప్రొడ్యూస్ చేస్తున్న ‘గుంటూరు కారం’లో శ్రీ లీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 12న థియేటర్లలోకి సినిమా రానుంది.

https://youtube.com/watch?v=uFpDexeZsG8%3Fsi%3DWX1ynXAQ4mpEMd_E