బిఆర్ఎస్ కు దీటుగా కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రచారం..

ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతుండడం తో అధికార పార్టీ బిఆర్ఎస్ మరింత దూకుడు పెంచింది. కేవలం సభలు , సమావేశాలే కాకుండా సోషల్ మీడియా ను కూడా గట్టిగా వాడుకుంటుంది. ముఖ్యంగా యూట్యూబ్ తో పాటు టీవీ లలో బిఆర్ఎస్ ఎన్నికల ప్రచారం చేస్తుంది. బిఆర్ఎస్ సంక్షేమ పధకాలను తెలుపుతూ మరోసారి బిఆర్ఎస్ కే ఓటు వేయాలని కోరుతుంది.

ఇదే క్రమంలో కాంగ్రెస్ సైతం బిఆర్ఎస్ కు దీటుగా సోషల్ మీడియా ప్రచారం మొదలుపెట్టింది. అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ మార్పు కావాలి-కాంగ్రెస్ రావాలి పేరుతో ప్రచారాన్ని ప్రారంభించింది. సీఎం కేసీఆర్ ఇస్తున్న హామీలు, వాటి వైఫల్యాలను ఎత్తి చూపుతూ కాంగ్రెస్ పార్టీ రూపొందించిన వీడియోలు ప్రజలను ఆలోచింపజేసే విధంగా ఉన్నాయని కాంగ్రెస్ ( Congress ) వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ హామీలు ఇచ్చి నెరవేర్చలేదని.. వాటిని ప్రజలు ఎత్తిచూపుుతున్నారని వీడియోలలో చూపించారు. సీఎం కేసీఆర్ ఇస్తున్న హామీలు తప్పుడవని చెప్పేలా వినూత్న రీతిలో ఈ వీడియోలు రూపొందించామని కాంగ్రెస్ ప్రకటించుకుంది.

కేసీఆర్ తప్పుడు మాటలను ప్రజలు నమ్మడం లేదని, ఈ సారి కారు పంక్షర్ అవడం ఖాయమని.. మార్పు కావాలి-కాంగ్రెస్ రావాలి అని ప్రజలు కోరుకుంటున్నట్లు రూపొందించిన ఈ వీడియోలు అందరినీ ఆకర్షిస్తున్నాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.