ఏపీ రోడ్ల దుస్థితి ఫై టీడీపీ-జనసేన పార్టీల ఉమ్మడి ఆందోళన

రాబోయే ఎన్నికల్లో జనసేన – టిడిపి కలిసి బరిలోకి దిగబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇరు పార్టీలు కలిసి ఉమ్మడి కార్యాచరణ కార్యక్రమాలు చేపట్టాలని డిసైడ్ అయ్యాయి. ఈ తరుణంలో ప్రతి శని , ఆదివారాల్లో వైసీపీ ప్రభుత్వం ఫై ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది.

ఇందులో భాగంగా ఈరోజు , రేపు రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై ఆందోళనలు చేపట్టనుంది. గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేదీ పేరుతో కార్యక్రమం చేపట్టనుంది టీడీపీ-జనసేన పార్టీల కూటమి. గుంతలు పడ్డ రోడ్లు.. ప్రభుత్వ నిర్లక్ష్యం.. ప్రజలు పడుతోన్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ సోషల్ మీడియా క్యాంపెయినుకూ నిర్ణయం తీసుకుంది. GunthalaRajyamAP, WhyAPHatesJagan హ్యాష్ ట్యాగులతో సోషల్ మీడియా వేదికగా టీడీపీ – జనసేన ప్రచారం మొదలుపెట్టింది. టీడీపీ-జనసేన పార్టీలు కలిసి మెలసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్‌ చేయాలని పేర్కొన్నారు.